మధ్య ప్రదేశ్ సీఎం కుటుంబానికి 335 ఎకరాల భూమి.. జుడీషియల్ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
భారతదేశం, జూన్ 24 -- మధ్యప్రదేశ్ రాజకీయాల్లో భూ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులు, వారి ఆధీనంలోని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారనే నివేదికలు వెలువడటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇది ముమ్మాటికీ 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (పరస్పర ప్రయోజనాల ఘర్షణ) కిందకే వస్తుందని ఆరోపిస్తూ, సీఎం మోహన్ యాదవ్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. సీఎం మోహన్ యాదవ్ కుటుంబానికి, వారి కంపెనీలకు ఉజ్జయిని పరిసరాల్లో మొత్తం 335 ఎకరాల భూమి ఉంది. ఇందులో దాదాపు 168 ఎకరాల భూమిని 2024-25 కాలంలోనే కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ ఉజ్జయిని జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.