మద్యం అలవాటు ఉందా? డిటాక్స్ డ్రింక్స్‌తో లివర్ బాగుపడుతుందా? వైద్యుల హెచ్చరిక
భారతదేశం, అక్టోబర్ 22 -- శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కాలేయాన్ని (లివర్) క్షణాల్లో శుభ్రం చేస్తామంటూ మార్కెట్లో లభించే 'డిటాక్స్ డ్రింక్స్', 'క్లెన్సింగ్ డైట్ల' ప్రచారాల్లో నిజం లేదని వైద్య నిపుణులు తేల్చిచెప్పారు. ఎన్నో ఏళ్లుగా మద్యం తాగడం వల్ల పాడైపోయిన కాలేయాన్ని కేవలం డిటాక్స్ ఉత్పత్తులతో బాగు చేయవచ్చని అనుకోవడం పూర్తిగా అపోహేనని రాజ్‌కోట్‌లోని స్టెర్లింగ్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జీఐ, హెచ్‌పీబీ, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఆదిత్య (భీమ్సీ) కండోరియా స్పష్టం చేశారు.
మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత దానిని విచ్ఛిన్నం చేసే క్రమంలో కాలేయం 'ఎసిటాల్డిహైడ్' అనే హానికరమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనం కాలేయ కణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నిరంతరం మద్యం సేవించడం వల్ల కాలేయంలో వాపు, కొవ్వు పేరుకుపోవడం, కణజాలం దెబ్బతినడం వంటి సమస్యలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.