భారతదేశం, ఆగస్టు 10 -- తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నమోదు చేసుకున్న మత్స్యకారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.

వేట సమయంలో జలవనరుల వద్ద ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. 18 నుండి 70 ఏళ్ల వయస్సు గల దాదాపు 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు ఈ బీమా రక్షణ వర్తిస్తుంది. జూన్ 1 నుంచే ఈ పాలసీ వ్యవధి ప్రారంభమైందని, అర్హులైన ప్రతి మత్స్యకారుడికీ బీమా కవరేజ్ అందుతుందని తెలిపారు.

ప్రమాదవశాత్తు మరణిస్తే.. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల అందిస్తారు....