భారతదేశం, సెప్టెంబర్ 21 -- వయసు పైబడే కొద్దీ పేరు మరచిపోవడం, తాళం చెవులు ఎక్కడో పెట్టి వెతకడం, మాట్లాడేటప్పుడు సరైన పదం వెంటనే గుర్తుకురాకపోవడం వంటివి సాధారణంగా జరిగేవే. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) కావు. అయితే జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానంలో వచ్చే మార్పులు తరచూ వేధిస్తూ, రోజురోజుకూ పెరుగుతూ, నిత్యజీవితంలో రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంటే మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి.

"మతిమరుపు అనేది కేవలం వయోభారం వల్ల వచ్చే సాధారణ మార్పు కాదు. అది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తున్నప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి" అని హైదరాబాద్ లక్డీకాపూల్ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి తెలిపారు. డిమెన్షియా ప్రారంభ సంకేతాలను సూచించే 7 కీలక లక్షణాలను ఆయన వివరించారు.

ఇటీవల తెలుసుకున్న విషయాలన...