భారతదేశం, అక్టోబర్ 15 -- హిందూ సామాజిక వ్యవస్థ నుంచి ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ పూర్వ కుల హోదా ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద లబ్ధిని పొందలేరని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ పి.కె. మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పునిచ్చింది.

తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీఓను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చి 9న ఒక ప్రత్యేక ఉత్తర్వు (GO) జారీ చేసింది. దీని ప్రకారం.. వెనుకబడిన తరగతులు (BC), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు లేదా షెడ్యూల్డ్ కులాల (SC) నుంచి ఇస్లాంలోకి మారిన వారిని 'బీసీ (ముస్లిం)' పరిధిలోకి తెస్తూ 7 గుర్తించిన తెగల్లో ఒకటిగా బీసీ సర్టిఫికేట్ ప...