భారతదేశం, ఏప్రిల్ 25 -- ఇంఫాల్: ఏడాదన్నర కాలంగా జాతుల మధ్య చిచ్చుతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శనివారం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పాలని, హింసకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్ సింగ్ నివాసం వైపు భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే, భద్రతా దళాలు వారిని బారికేడ్లతో అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు పలు రౌండ్ల టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడంతో ఇంఫాల్‌లోని బాబూపారా ప్రాంతం అట్టుడికిపోయింది.

మైతీ సామాజిక వర్గానికి చెందిన పౌర సమాజ సంస్థ 'కోకోమి' (COCOMI) పిలుపు మేరకు నగరం నలుమూలల నుంచి నిరసనకారులు ర్యాలీగా బయలుదేరారు. ముఖ్యమంత్రి బంగ్లాకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖురాయ్ లామ్లాంగ్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున...