భారతదేశం, మార్చి 22 -- నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగింది. కండరాల పుష్టి (Muscle Building) కోసం చాలామంది జిమ్‌లలో గంటల తరబడి శ్రమిస్తున్నారు. అయితే, వర్కవుట్‌లతో పాటు త్వరగా ఫలితాలు రావాలని రకరకాల సప్లిమెంట్లను వాడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'హెల్త్ ఎక్స్‌పర్ట్స్' పేరుతో చాలామంది ఇచ్చే సలహాలు ఒక్కోసారి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి.

ఈ నేపథ్యంలో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేవారికి నిజంగా ఏ సప్లిమెంట్స్ అవసరం? వేటికి దూరంగా ఉండాలి? అనే అంశాలపై హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ కీలక సూచనలు చేశారు.

శాస్త్రీయ ఆధారాలు ఉన్నవి, కండరాల నిర్మాణానికి నిజంగా తోడ్పడే సప్లిమెంట్లను డాక్టర్ సుధీర్ ఈ విభాగంలో చేర్చారు.

కొన్ని సప్లిమెంట్లను శరీరంలో వాటి లోపం ఉన్నప్పుడు లేదా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ...