భారతదేశం, మే 23 -- పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక అడుగులు వేశారు. గురువారం దాదాపు నాలుగు గంటల పాటు సాగిన మంత్రిమండలి సమావేశంలో కేంద్ర మంత్రులందరికీ వారి వారి శాఖల పనితీరుకు సంబంధించిన 'రిపోర్ట్ కార్డుల'ను అందజేశారు. క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ అసెస్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఏయే శాఖలు ముందున్నాయి, ఎక్కడ వెనుకబడ్డాయో గణాంకాలతో సహా వివరించారు.

శాఖల వారీగా నిర్వహించిన ఈ సమీక్షలో కొన్ని మంత్రిత్వ శాఖలు అద్భుతమైన ప్రతిభ కనబరిచాయి. ముఖ్యంగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు కీలక విభాగాల్లో (ఫిర్యాదుల పరిష్కారం, పశ్చిమ ఆసియా యుద్ధ సంక్షోభ నిర్వహణ) టాపర్‌గా నిలిచింది. ఫైళ్ల పరిష్కారం, మేనేజ్‌మెంట్ విభాగంలో బొగ్గు శాఖ అత్యుత్తమ మార్కులు సాధించింది. విద్యుత్, ఆరోగ్య శాఖలు కూడా వివిధ కేట...