భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణ రాజకీయాలు దిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ముఖ్యనేతల మధ్య వరుసగా జరిగిన భేటీల అనంతరం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోని ఇందిరా భవన్ తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యనేతల భేటీల కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గంలో క్రమశిక్షణ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. టీప...