మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు షాక్ తప్పదా? పీసీసీకి అందిన రిపోర్ట్
భారతదేశం, ఆగస్టు 25 -- తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు, నాయకుల బహిరంగ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ సమగ్ర విచారణ పూర్తి చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ తయారు చేసిన తుది నివేదికను కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు అందజేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మహేష్‌కుమార్ గౌడ్‌తో సమావేశమైన కమిటీ నాయకులు ఈ నివేదిక ప్రతిని అందజేశారు.
పార్టీ నిబంధనలను, హద్దులను దాటి మాట్లాడిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.