భారతదేశం, నవంబర్ 24 -- దైవదర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న కుటుంబాల ప్రయాణం విషాదాంతమైంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న భారీ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది.

విశాఖ జిల్లా భీమిలి, తగరపువలస ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగం ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి స్వస్థలాలకు బయలుదేరారు. మార్గమధ్యలో విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట వద్దకు రాగానే, రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఓ ట్యాంకర్‌ను వీరి కారు అత్యంత వేగంతో ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జ...