భారతదేశం, జూన్ 22 -- ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. 2026, జూన్ 22వ తేదీ సోమవారం సాయంత్రం నగరంలో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఒక అధికారిక 'వెదర్ అలర్ట్ అండ్ ట్రాఫిక్ అడ్వైజరీ'ని విడుదల చేసింది.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ఈ అడ్వైజరీ ప్రకారం... గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చందానగర్ వంటి ఐటీ హబ్‌లలో పనిచేసే కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగులకు విడతల వారీగా మధ్యాహ్నం 3:30 గంటల నుంచే ముందస్తు లాగౌట్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్...