భారతదేశం, ఆగస్టు 31 -- భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై జపనీస్ ఆటో దిగ్గజం హోండా తన పట్టును మరింత పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విజయవంతంగా కొనసాగుతున్న తన సరికొత్త ఇ-స్కూటర్ 'హోండా యూసీ3' (Honda UC3) డిజైన్‌ను భారత పేటెంట్ కార్యాలయంలో నమోదు చేసింది. థాయ్‌లాండ్, వియత్నాం మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్, త్వరలోనే భారతీయ రోడ్లపైకి రానుందనే ఊహాగానాలకు ఈ పేటెంట్ దారితీసింది.

అయితే, వాహన తయారీ సంస్థలు తమ మేధో సంపత్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) హక్కుల పరిరక్షణ కోసం పలు గ్లోబల్ మోడళ్లను భారతదేశంలో పేటెంట్ చేస్తుంటాయి. కాబట్టి పేటెంట్ నమోదు చేసుకున్నంత మాత్రాన వెంటనే మార్కెట్లోకి తెస్తారని ఖచ్చితంగా చెప్పలేం గానీ, ఈవీ ఆప్షన్లను విస్తరించే దిశగా హోండా అడుగులు వేస్తున్నట...