భారతదేశం, నవంబర్ 3 -- దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ తన ప్రయోగాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ 'డ్రీమ్‌బీన్స్' (Dreambeans)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారుల కోసం నవంబర్ 3న ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా తర్వాత ఈ యాప్‌ను విస్తరించిన తొలి అంతర్జాతీయ మార్కెట్ భారత్‌ కావడం విశేషం. గూగుల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ యాప్.. యూజర్ల ఆసక్తులు, దైనందిన కార్యకలాపాలకు అనుగుణంగా బొమ్మలు, వీడియోలతో కూడిన డిజిటల్ స్టోరీలను రూపొందిస్తుంది.

వినియోగదారులు సెర్చ్ బార్‌లో టైప్ చేయడం లేదా ఫీడ్‌ను స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండానే డ్రీమ్‌బీన్స్ పనిచేస్తుంది. జీమెయిల్, గూగుల్ ఫోటోస్, క్యాలెండర్, సెర్చ్, జెమిని, యూట్యూబ్ వంటి సేవలతో ఈ యాప్‌ను అనుసంధానించవచ్చు. యూజర్లు కనెక్ట్ చ...