భారతదేశం, జనవరి 25 -- అమెరికాలో స్థిరపడాలనే సాఫ్ట్‌వేర్ నిపుణుల కలలకు 'వీసా స్టాంపింగ్' గండం చుట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఏకంగా 2027 వరకు పెరిగిపోయింది. ఈ పరిణామం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మొదట 2025 డిసెంబరులో మొదలైన ఈ హెచ్​-1బీ వీసా ఇంటర్వ్యూ జాప్యం, క్రమంగా 2026 మార్చ్​కి, ఆపై అక్టోబర్‌కు, ఇప్పుడు ఏకంగా 2027 వరకు చేరుకుంది.

పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సూచనలు కనిపించడం లేదని వలస వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ ఉద్యోగులు వీసా స్టాంపింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు రావద్దని వారు సూచిస్తున్నారు.

"అమెరికా అధికారులు వీసాలు ఇవ్వడానికి ఎటువంటి తొందర పడటం లేదు. వీసాలను త...