భట్టి విక్రమార్క భార్యపై ఆరోపణలు.. విచారణ జరిపించాలని గవర్నర్కు రేవంత్ ఫిర్యాదు!
భారతదేశం, ఆగస్టు 11 -- తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిలిచిపోయిన మెడికల్ బిల్లుల విడుదలకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త, అడ్వకేట్ కరుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయంలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకురాలు ఎస్.కె. ప్రసన్నకుమారి చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు రేవంత్ స్పష్టం చేశారు. రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రావాల్సిన సుమారు రూ. 40 లక్షల మొత్తాన్ని విడుదల చేయడానికి డిప్యూటీ సీఎం భార్య.. 10 శాతం చొప్పున రూ. 4 లక్షల కమిషన్ డిమాండ్ చేశారని ప్రసన్నకుమారి తీవ్ర ఆరోపణలు చేసిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.