భారతదేశం, ఆగస్టు 11 -- తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిలిచిపోయిన మెడికల్ బిల్లుల విడుదలకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త, అడ్వకేట్ కరుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్‌కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయంలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకురాలు ఎస్.కె. ప్రసన్నకుమారి చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు రేవంత్ స్పష్టం చేశారు. రిటైర్‌మెంట్ ప్రయోజనాల కింద రావాల్సిన సుమారు రూ. 40 లక్షల మొత్తాన్ని విడుదల చేయడానికి డిప్యూటీ సీఎం భార్య.. 10 శాతం చొప్పున రూ. 4 లక్షల కమిషన్ డిమాండ్ చేశారని ప్రసన్నకుమారి తీవ్ర ఆరోపణలు చేసిన...