భారతదేశం, జనవరి 4 -- ప్రముఖ సీనియర్ హీరోయిన్, నటి, క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్‌కు సంబంధించిన ఒక వింత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 'నాగిన్' వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన సుధా చంద్రన్ ఒక భజన కార్యక్రమంలో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయారు. ఆ సమయంలో ఆమె ప్రవర్తించిన తీరు చూసి అక్కడి వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఎరుపు, తెలుపు రంగు చీర ధరించి, నుదుట 'జై మాతా జీ' అని రాసి ఉన్న బ్యాండ్ కట్టుకున్న సుధా చంద్రన్ భజన జరుగుతున్న హాల్లో గెంతుతూ (డ్యాన్స్ లేదా పూనకం) కనిపించారు. భక్తి పారవశ్యంతో తన సుధా చంద్రన్ తన నియంత్రణను పూర్తిగా కోల్పోయినట్లు వీడియోలో స్పష్టమవుతోంది.
ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఉధృతం కావడంతో సుధా చంద్రన్‌ను ఆపడానికి చుట్టుపక్కల వారు ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో తనను పట్టుకోవడానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.