భగ్గుమన్న ముడిచమురు.. $100 దాటడంతో కుప్పకూలిన అంతర్జాతీయ మార్కెట్లు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- అంతర్జాతీయ ఆర్థిక రంగానికి మళ్లీ చమురు మంటలు అంటుకున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ బలగాల మధ్య క్షిపణి దాడులు తీవ్రతరం కావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మూడేళ్ల తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటిపోయింది. ఆయిల్ రేట్లు ఊహించని రీతిలో పెరగడంతో గ్లోబల్ మార్కెట్లలో ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. దీని ప్రభావంతో అమెరికా, ఐరోపా షేర్ మార్కెట్లతో పాటు బాండ్ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ దాడులకు తెగబడ్డాయి. దానికి ప్రతీకారంగా అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లను క్షిపణులతో ధ్వంసం చేశాయి. ఈ సైనిక ఘర్షణలతో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' గుండా సరఫరా నిలిచిపోతుందనే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.