భారతదేశం, జూలై 15 -- అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం (జూలై 15) నాటి ట్రేడింగ్‌లో వరుసగా మూడో రోజూ ధరలు లాభాల్లో పయనించాయి. ఇరాన్‌పై మరిన్ని దాడులు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇరాన్ రవాణా నౌకలపై అమెరికా మళ్లీ దిగ్బంధాన్ని విధించడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ప్రస్తుత ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 1.46 డాలర్లు (1.72 శాతం) పెరిగి బ్యారెల్‌కు 86.19 డాలర్లకు చేరుకుంది. జూన్ 12 తర్వాత బ్రెంట్ క్రూడ్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 1.11 డాలర్లు (1.4 శాతం) పుంజుకుని, బ్యారెల్‌కు 80.40 డాలర్ల వ...