భారతదేశం, సెప్టెంబర్ 14 -- హైదరాబాద్ నగరం వినాయక చవితి పండుగ శోభతో విలసిల్లుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి 70 అడుగుల భారీ ఎత్తులో 'శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి' రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ గణపతికి తొలి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు. మెుదట ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గవర్నర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అందించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్య...