భారతదేశం, ఏప్రిల్ 2 -- మన దేశంలో ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ (హెల్త్ కాన్షియస్) పెరిగిన చాలా మంది తెల్ల చక్కెర (వైట్ షుగర్)కు బదులుగా బ్రౌన్ షుగర్‌ను వాడటం అలవాటు చేసుకున్నారు. బ్రౌన్ షుగర్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యతో బాధపడేవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు బ్రౌన్ షుగర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ నమ్మకంలో ఎంతవరకు నిజముంది? తెల్ల చక్కెర కంటే బ్రౌన్ షుగర్ నిజంగానే ఉత్తమమైనదా?

దీనిపై ప్రముఖ ఫ్రెంచ్ బయోకెమిస్ట్, 'న్యూయార్క్ టైమ్స్' బెస్ట్ సెల్లింగ్ ఆథర్ జెస్సీ ఇంచౌస్ప్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బ్రౌన్ షుగర్‌కు, వైట్ షుగర్‌కు పోషకాల పరంగా ఎలాంటి తేడా ల...