భారతదేశం, మే 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజుకు ఇచ్చే 20 వేల్లలో కటింగ్స్ అన్ని చెప్పి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటాయి. రాజు చేసిన తప్పులన్ని ఇందు చెబుతుంది. తన నడుము చూసినందుకు కూడా రాజుకు ఫైన్ వేస్తుంది. కిచెన్‌లో ఇందు నడుము చూసేందుకు రాజు వేసిన వేశాలను గుర్తు చేస్తుంది.

అలా కండిషన్స్ బ్రేక్ చేసినందుకు 19 వేలు కట్ చేశాను, అందుకే వెయ్యి రూపాయలు ఇచ్చాను అని ఇందు చెబుతుంది. రేపైన కటింగ్ లేకుండా ఇవ్వమని రాజు అంటాడు. రేపటి నుంచి డైలీ కాకుండా వీక్లీ కొద్ది ఇస్తా. డబ్బులు అడ్జస్ట్ అవ్వట్లేదని ఇందు చెబుతుంది. ఇలా అయితే వెళ్లిపోతానని రాజు అంటే.. వెళ్లమని ఇందు అంటుంది. జీవితంలో నీకు మళ్లీ కనిపించను అని చెప్పిన రాజు వెళ్లకుండా ఆగిపోతాడు.

బయటకు వెళ్తే డబ్బు దొరకదు అనుకున్న రాజు వెనక్కి వస్తాడు. ...