భారతదేశం, ఫిబ్రవరి 9 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఎలాగైనా పాపను కాపాడమని హాస్పిటల్‌లో డాక్టర్‌తో అంటారు కావ్య, దుగ్గిరాల కుటుంబం. డాక్టర్ అనురాధ పాపను ఆపరేషన్‌కు తీసుకెళ్తుంది. కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఐసీయూ వరకు వెళ్తుంది. పాప తిరిగి రాకపోతే ఈ బిడ్డ కన్నతల్లికి ఏమని సమాధానం చెబుతామని భయపడుతుంది కావ్య.

నీ పేగు బంధం గట్టిది కాబట్టే నీ బిడ్డ గురించి తెలిసింది. ఈ తల్లి ప్రేమే ఈ పాపను కాపాడుతుంది అని రాజ్ ఓదారుస్తాడు. మరోవైపు రౌడీలకు రుద్రాణి కాల్ చేస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా. హాస్పిటల్ థియేటర్ నుంచి పాప ప్రాణాలతో బయటకు రాకూడదు. హాస్పిటల్‌లోకి వెళ్లేలా నేను చూసుకుంటాను అని రుద్రాణి చెబుతుంది.

ఇంతలో హెడ్ నర్స్ నీలవేణికి కాల్ చేస్తుంది రుద్రాణి. నీలవేణి భయపడుతుంది. నా మనుషులు హాస్పిటల్‌లోకి వస్తారు. వాళ్లను లోపలికి పంప...