భారతదేశం, ఫిబ్రవరి 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆగమని అపర్ణ అరుస్తుంది. మళ్లీ ఎందుకు వచ్చావని, అడుగు లోపల పడితే చంపేస్తానని బెదిరిస్తుంది అపర్ణ. కానీ, అది లెక్క చేయకుండా రేఖ ఇంట్లోకి వస్తుంది.

దాంతో రేఖ పీక పట్టుకుంటుంది అపర్ణ. ఆవేశపడకండి ఆంటీ. ఇప్పుడు నీకు ఎవరు భయపడరు. ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివి ఎలా పాలించగలవు. దుగ్గిరాల ఆస్తులను నా చేతిలో పెట్టండి. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని రేఖ అంటుంది. నేను నిన్ను జైళ్లో పెట్టి చిప్పకూడు తినిపించగలను అని అపర్ణ అంటుంది.

నీ కొడుకు తలను బద్ధలు కొట్టి చంపిన నా తల్లి రుద్రాణి గుర్తుందా. తన కూతురుని నేను ఎలాంటిదాన్నో ఊహించలేవా. నేను నీ వారసురాళ్లను చంపేస్తే చూస్తూ ఊరుకో...