భారతదేశం, ఫిబ్రవరి 20 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పుకు ఎస్సై ధనుంజయ్ కాల్ చేసి హాస్పిటల్‌లో అటాక్ చేసిన రౌడీలను ఏం చేద్దాం, అందులో ఒకడు నోరు జారి ఓ లేడి అన్నాడు, కానీ, ఆమె పేరు తెలియదంటున్నాడు అని చెబుతాడు. సరేనని అదంతా విన్న కల్యాణ్‌తో అప్పు కూచీ.. అని సాగదీస్తుంది.

అంత సాగదీయకు అర్థమైంది. కానీ, ముందు మినిస్టర్ ఇంటికి వెళ్లి ఫంక్షన్‌కి వెళ్లి తర్వాత అక్కడికి వెళ్దామని కల్యాణ్ అంటే.. లేదని చాలా లేట్ అవుతుందని, రౌడీల విషయం సీఐకి తెలిస్తే సమస్య అవుతుందని అప్పు అంటుంది. దాంతో సరేనని కల్యాణ్ ఒప్పుకుంటాడు.

మరోవైపు అంతా మినిస్టర్ ఇంటికి బారసాలకు వెళ్లేందుకు రెడీ అవుతారు. కావ్య పాపకు ఏ పేరు పెడదామని ఇందిరాదేవి అడుగుతుంది. హాలీవుడ్ హీరోయిన్ పెడదామని ప్రకాశం అంటే.. ఏ హుడ్డు లేదు.. చక్కగా సాంప్రదాయంగా ఉండాలని ఇందిరాదేవి అంటే.. అలా...