భారతదేశం, జూలై 3 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నవాళ్ల ప్రేమ కావాలా, ఖరీదైన ఇల్లు కావాలా అని రాజును తండ్రి చలపతి అడుగుతాడు. తల్లి కూడా రమ్మంటుంది. నాన్నను జాగ్రత్తగా తీసుకెళ్లు అని తల్లికి చెబుతాడు రాజు. దానికి అంతా షాక్ అవుతారు.

నువ్వు ఎవరిని కాదంటున్నావో అర్థమవుతందా అని తల్లి అంటుంది. కన్నకొడుకు అంటే నీలా ఉండాలిరా. నీలాంటి వాడిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలి. వీడు ఈ కోట్ల ఆస్తి చూడగానే మన కొడుకు అని మర్చిపోయాడు. వీడు పూర్తిగా మారిపోయాడు. మనల్ని బికారీలుగా చూస్తున్నాడు. వీడి మనసు స్వార్థంతో నిండిపోయిందని చలపతి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఇన్నేళ్ల మా ప్రేమకు, నిరీక్షణకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదారా అని చలపతి అంటాడు. నువ్వు లేకుండా ఉండలేమురా అని తల్లి అంటుంది. మనం వాడి కాళ్లు ప...