భారతదేశం, జూన్ 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కారులో ఇందు టెన్షన్ పడుతుంటే ఐశ్వర్య సంతోషిస్తుంది. సిటీ నుంచి చాలా దూరం వచ్చాం. రాకేష్ ఎక్కడ ఉన్నాడని ఇందు అడుగుతుంది. నాకేం తెలుసు అన్న ఐశ్వర్య.. లొకేషన్ పెట్టాడు. అలానే వెళ్తున్నా అని అంటుంది.

మరోవైపు సైకిల్‌పై రేడియో పెట్టుకుని ఒకతను రోడ్డుపై వెళ్తుంటాడు. ఐశ్వర్య హారన్ కొడుతుంది. దాంతో అతను ఆపి రోడ్డు అడ్డంగా సైకిల్ పెట్టి ఐశ్వర్యతో గొడవ పడతాడు. హారన్ కొడుతుంటే పక్కకు జరగలాని బుద్ధి లేదా అని ఐశ్వర్య అంటే.. అతను వెటకారంగా మాట్లాడుతాడు.

ఇందు గొడవ వద్దని అంటుంది. సైకిల్ నెమ్మదిగా వెళ్తుంది, మెల్లిగా వెళ్లాలని నీకు తెలియదా అని నారాయణ అంటాడు. వెళ్లి సైకిల్ తీయమని ఐశ్వర్య అంటే.. నా ఇగో హర్ట్ అయిందని నారాయణ అంటాడు. రోడ్డుపై అలాగే సైకిల్‌తో వెళ్తాడు నా...