భారతదేశం, జూన్ 23 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీకి నిజం చెప్పడంపై రాజుతో గొడవ పెట్టుకుంటుంది ఇందు. చెప్పురా ఎందుకు అలా చేశావు అని అరెయ్ అంటూ రెచ్చిపోతుంది. ఇలా మాట్లాడితే నేను కూడా దిగజారి మాట్లాడాల్సి వస్తుందని రాజు అంటే.. అప్పుడు నా చేతికి పని చెబుతానంటుంది ఇందు.

అంటే నన్ను కొడతాను అంటావా. నా మొహం తప్పా నీకు దిక్కు లేదు. నీకు తిక్క ఉంది. వెర్రి ఉందని రాజు అంటాడు. ఇందు కూడా తిడుతుంది. అది అపర్ణ చూస్తుంది. అపర్ణను రాజు, ఇందు షాక్ అవుతారు. మీరు ఇలా తిట్టుకుంటే బయటివాళ్లు ఏం అనుకుంటారు. నిజంగానే భార్యాభర్తలు కాదనుకుంటారు అని అపర్ణ అంటుంది.

దాంతో ఇందును దగ్గరికి తీసుకుని అలాంటిదేం లేదని, మేము నిజంగానే భార్యాభర్తలం. ఇలా దగ్గరికి తీసుకుంటే భర్త కాకుండా ఉంటే ఇందు కొట్టేది కదా అని రాజు అంటాడు. నే...