భారతదేశం, జూన్ 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ కాళ్లకు తల్లి లక్ష్మీ మందు రాస్తుంది. ఈ కష్టాలు ఇంకొన్ని రోజులే. త్వరలోనే మంచి జాబ్ సంపాదిస్తాను అని వెంకీ అంటాడు. అదేంట్రా ఇది మంచి జాబే కదా అని చలపతి అంటే.. ఇప్పుడు ఏఐ ట్రైనింగ్ తీసుకుంటున్నా కదా. అప్పుడు ఇంకా మంచి జాబ్ వస్తుందని వెంకీ అంటాడు.

మరోవైపు రాజుతో లక్కీ మందు సిట్టింగ్ వేస్తాడు. ఐశ్వర్య సీక్రెట్‌గా చూస్తుంది. రాజును మాటలో పెట్టి నీ లైఫ్‌లో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. నీ పెళ్లి పెద్ద మిరాకిల్ కదా అని లక్కీ అంటాడు. అసలు ఇందుతో పెళ్లి ఎలా జరిగింది. తను నిన్ను ఎలా పెళ్లి చేసుకుందని లక్కీ అడుగుతాడు.

అసలు మా పెళ్లే జరగలేదు. మా పెళ్లి అనేది అబద్ధం అని రాజు చెబుతాడు. అదంతా ఐశ్వర్య లక్కీకి కూడా తెలియకుండా వీడియో తీస్తుంది. అదేంట్రా ఆ ఇంట్లో...