భారతదేశం, అక్టోబర్ 12 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య పెళ్లి గురించి అందరూ మాట్లాడుతారు. ఎహే ఆపండి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు. నాకు ఈ తతంగాలు ఏమి వద్దు. ఈ ఇంట్లోనే సింపుల్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పెళ్లి చేయండి అని గట్టిగా చెబుతుంది ఐశ్వర్య.

అంతా వ్యతిరేకిస్తారు. నా ఫ్రెండ్స్ మధ్య రెస్పెక్ట్ తగ్గిపోతుంది. నా సర్కిల్‌లో ఎవరికి తెలియొద్దు. డేట్ ఫిక్స్ చేయండని ఐశ్వర్య అంటుంది. ఎంత చెప్పిన ఐశ్వర్య వినదు. సరేఅని అంతా ఓకె చెబుతారు. అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించండి. నా మెడలో మూడు ముళ్లు పడగానే నా చేతిలో పేపర్స్ పడాలని చెప్పి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

గాంధర్వ పెళ్లి విన్నాను కానీ ఇలా గందరగోళం పెళ్లి చూడలేదని శేషు అంటాడు. మరోవైపు మదన్ అలసిపోయి ఉంటాడు. ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన స్వాత...