బొండాడ ఇంజినీరింగ్‌కు భారీ ప్రాజెక్ట్.. దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్
భారతదేశం, అక్టోబర్ 22 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) దిగ్గజం బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టును కైవసం చేసుకుంది. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ (జీఐపీసీఎల్) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (VRFB BESS) నిర్మాణానికి ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే ఇది అతిపెద్ద గ్రిడ్-స్కేల్ స్టోరేజ్ ప్రాజెక్టు కావడం విశేషం.
గుజరాత్‌లోని వడోదరలో జీఐపీసీఎల్కు 165 మెగావాట్ల సామర్థ్యమున్న సహజ వాయువు (న్యాచురల్ గ్యాస్) పవర్ ప్లాంట్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడే 20 మెగావాట్లు/ 120 మెగావాట్ అవర్ (MWh) సామర్థ్యంతో ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌ను బొండాడ ఇంజినీరింగ్ నిర్మించనుంది. కేవలం నిర్మాణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.