బైపాస్ సర్జరీ అయినా తగ్గలేదు... 73 ఏళ్ల వయసులో భద్రాచలం వాసి సత్తా! వరల్డ్ పవర్‌లిఫ్టింగ్‌లో పతకాలు!
భారతదేశం, నవంబర్ 16 -- వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని, సంకల్ప బలం ముందు శారీరక అడ్డంకులు చిన్నబోతాయని తెలంగాణకు చెందిన ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారి నిరూపించారు. గుండెకు బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ ఏమాత్రం వెరవకుండా పవర్‌లిఫ్టింగ్‌లో అడుగుపెట్టిన 73 ఏళ్ల డి.వి. శంకర్ రావు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. గతేడాది జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాలతో మెరిసిన ఆయన... తాజాగా ప్రపంచ వేదికపై భారత్ కీర్తి పతాకను ఎగురవేశారు.
అమెరికాలోని నెవాడా రాష్ట్రం.. రెనో నగరంలో 2026 అక్టోబర్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తాను ఈ పతకాలు గెలుచుకున్నట్లు భద్రాచలం పట్టణానికి చెందిన శంకర్ రావు ఆదివారం వెల్లడించారు. మాస్టర్స్-4, 74 కిలోల విభాగంలో పోటీపడిన ఆయన అక్టోబర్ 15న జరిగిన క్లాసిక్ విభాగంలో ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.