భారతదేశం, జూన్ 16 -- తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నారాయణగూడ సర్వే భవన్ ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌(Multi Zone-2) సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 11 నుండి 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. నరహరి నివాసముంటున్న పాతబస్తీ ఛత్రినాకలోని ఇల్లు, ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లలో జరిపిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రకారం రూ.13.05 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.150 కోట్ల...