భారతదేశం, మే 4 -- పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఉత్కంఠభరిత ఘట్టానికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఏకంగా 181 స్థానాల్లో ముందంజలో ఉండటంతో, మమతా బెనర్జీ కోట కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫలితాలను 'నకిలీవి'గా కొట్టిపారేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి తన ఏజెంట్లు ఎవరూ బయటకు రావద్దని, సాయంత్రానికి ఫలితాలు తలకిందులవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

తప్పుడు సమాచారం: టీఎంసీ ఇప్పటికీ సుమారు 100 నియోజకవర్గాల్లో ముందంజలో ఉందని, కానీ ఆ సమాచారాన్ని ఎన్నికల కమిషన్ బయటపెట్టడం లేదని ఆమె ఆరోపించారు.

వ్యూహాత్మక జాప్యం: టీఎంసీ గెలిచే అవకాశాలున్న చోట ట్రెండ్స్ చూపించకుండా జాప్యం చేస్తున్నారని, ఇది బీజేపీ కుట్రలో భాగమని పేర్కొన్నారు.

14-18 రౌండ్ల తర్వాత అసలు మజా...