బెంగళూరు మెట్రో 'పింక్ లైన్' ప్రారంభించిన ప్రధాని మోదీ
భారతదేశం, నవంబర్ 13 -- ఐటీ రాజధాని బెంగళూరు ప్రజా రవాణా వ్యవస్థలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నమ్మ మెట్రో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'పింక్ లైన్' ఎలివేటెడ్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గవర్నర్ సుధా యాదవ్, ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎంపీ తేజస్వి సూర్య, మంత్రి కృష్ణ బైరేగౌడలతో కలిసి ప్రధాని మెట్రో రైలులో ప్రయాణించారు.
నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి ఈ కొత్త మార్గం సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. పింక్ లైన్ చేరికతో బెంగళూరులో కార్యకలాపాలు సాగిస్తున్న మొత్తం మెట్రో నెట్వర్క్ పొడవు 103.6 కిలోమీటర్లకు చేరింది. ఫలితంగా దేశ రాజధాని దిల్లీ తర్వాత, భారత్లోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన నగరంగా బెంగళూరు రికార్డు సృష్టించింది.
బెంగళూరులో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను విస్తరించే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.