భారతదేశం, మే 18 -- ఐటీ హబ్ బెంగళూరులో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడిన జనం.. ఇప్పుడు ఖర్చు తగ్గించుకుంటున్నారా? అవుననే అంటున్నాయి నగరంలోని తాజా పరిస్థితులు. ఒకప్పుడు కిక్కిరిసిపోయే పబ్‌లు, టిఫిన్ సెంటర్లు ఇప్పుడు పల్చటి జనంతో వెలవెలబోతున్నాయి. దీనికి కారణం ఇరాన్ యుద్ధం వల్ల పెరిగిన ద్రవ్యోల్బణమా లేక నగరంలో సాగుతున్న ఎండల తీవ్రతా? అనే చర్చ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

నెల రోజుల పాటు విరామం లేకుండా పనిచేసిన ఒక నెటిజన్, సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేద్దామని బయటకు వెళ్తే అతనికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. శనివారం సాయంత్రం ఫుల్ రద్దీగా ఉండాల్సిన పబ్‌లో కేవలం నాలుగైదు టేబుళ్లు మాత్రమే నిండి ఉన్నాయి. ఆదివారం ఉదయం టిఫిన్ కోసం వెళ్తే, అక్కడ కూడా పార్కింగ్‌లో వాహనాలు లేవు, పార్శిల్ కోసం క్యూలు అసలే లేవు. "బెంగళూరు జనం ఖర్చు చేయడం తగ్గించేశారా? లే...