భారతదేశం, మే 18 -- దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హై-స్పీడ్ రైలు' కల నిజమయ్యే సమయం దగ్గరపడుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా బయటపెట్టింది. ఢిల్లీలోని రైల్వే భవన్‌ గేట్ నంబర్ 4 వద్ద ఈ రైలు నమూనా ఫొటోను ప్రదర్శనకు ఉంచారు. ఆధునిక హంగులతో, ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న ఈ రైలు భారత రైల్వే రూపురేఖలను మార్చేయనుంది.

ఈ హై-స్పీడ్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ సాగే ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మించనున్నారు.

మహారాష్ట్రలో: బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (ముంబై), థానే, విరార్, బోయిసర్.

గుజరాత్‌లో: వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్/నదియాడ్, అహ్మదాబాద్, సబర్మతి.

ప్రస్తుతం ముంబై...