భారతదేశం, నవంబర్ 11 -- డిసెంబర్ చాలా ముఖ్యమైన నెల కాబోతోంది. ఎందుకంటే ఈ నెలలో అనేక ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. సూర్యుడు, బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతిష్ట, ఉన్నత హోదా, నాయకత్వ లక్షణాలను సూచిస్తాడు. డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు డిసెంబర్ 22న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా ధనుస్సు రాశిలో సూర్య-బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తుంది. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. ఈ బుధాదిత్య యోగం శుభ, అశుభ ప్రభావాలను రెండింటినీ ఇస్తుంది. ధనుస్సు రాశిలో ఈ కలయిక ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహ సంచారం ప్రత్యేకంగా కొన్ని రాశులకు రాజ యోగాన్ని ఇస్తుంది.

మేష రాశి వారికి బుధాదిత్య రాజయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. పనిలో మీ ఆత...