భారతదేశం, అక్టోబర్ 6 -- స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేస్తూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, అనగాని సత్యప్రసాద్‌.. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.

సుప్రీంకోర్టు ద్వారా న్యాయం సాధించేందుకు ప్రభుత్వం పోరాటం చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపైరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ...