భారతదేశం, జూన్ 5 -- తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం ఆమోదించారు.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన కుప్పుసామి అన్నామలై పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నెల రోజులకు అన్నామలై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో సినీ నటుడు సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించ...