భారతదేశం, సెప్టెంబర్ 26 -- Bigg Boss 10 Telugu 2 Wild Card Entry And Mukesh Captain: తెలుగు ఓటీటీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 సరికొత్త వ్యూహాలతో సాగిపోతుంది. ప్రారంభమైన మొదటి రోజు నుంచే గొడవలు, గ్రూపులతో తెగ వినోదం పంచిన బిగ్ బాస్ తెలుగు 10లోకి మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తాజాగా ఇద్దరిని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 25 ఎపిసోడ్‌లో కామనర్ అపూర్వ తుంగతుర్తి ఎంట్రీ ఇచ్చింది. ఇదివరకు హౌజ్ కంటెస్టెంట్స్‌తో పెట్టిన ఓటింగ్‌లో అపూర్వకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి.

కాబట్టి, హౌజ్‌మేట్స్‌కు ఏమాత్రం నచ్చని కంటెస్టెంట్‌ను తీసుకొచ్చి 15 మందికి టెన్షన్ ఇస్తున్నట్లుగా బిగ్ బాస్ చెప్పాడు. అపూర్వకు అందరూ స్వాగతం పలికారు. అంతే...