బాపట్ల వద్ద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం - గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.!
భారతదేశం, జూన్ 15 -- Sarkar Express Robbery : గుంటూరు జిల్లా పరిధిలో రైలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బాపట్ల - అప్పిట్ల రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక దొంగల ముఠా దోపిడీకి పాల్పడేందుకు సాహసించింది. అర్ధరాత్రి వేళ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దొంగతనం యత్నం జరిగిందని రైల్వే పోలీసులు వెల్లడించారు.
పోలీసు అధికారులు అందించిన వివరాల ప్రకారం.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్3 (S3), ఎస్6 (S6) బోగీల్లో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దాడికి దిగింది. నిందితులు ప్రయాణికులకు చెందిన బ్యాగులను దొంగిలించి, వాటితో పరారవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో బోగీలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసును (గోల్డ్ చైన్) లాక్కోవడానికి దొంగలు ప్రయత్నించారు. దీంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.