భారతదేశం, నవంబర్ 4 -- తీవ్ర తుఫానుగా విరుచుకుపడిన 'మురసు' క్రమంగా బలహీనపడుతోంది. ఇది తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. తదుపరి 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి సాధారణ అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ ఉదయం 5:30 గంటల పరిశీలనల ప్రకారం.. ఈ అల్పపీడనం గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తర దిశగా ప్రయాణించింది. బుధవారం ఉదయం 5:30 గంటల సమయానికి ఇది తూర్పు తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అక్షాంశం 17.0deg ఉత్తరం, రేఖాంశం 80.1deg తూర్పు సమీపంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు వాయవ్యంగా 30 కిలోమీటర్లు, తెలంగాణలోని ఖమ్మంకు దక్షణంగ...