బజాజ్ ఆటో క్యూ1 అదిరిపోయే రిజల్ట్స్: 4% పెరిగిన స్టాక్
భారతదేశం, జూలై 22 -- త్రైమాసిక ఫలితాలు (Q1FY27) అద్భుతంగా నమోదవడంతో జూలై 22 బుధవారం నాడు బజాజ్ ఆటో షేరు దలాల్ స్ట్రీట్లో దూసుకెళ్లింది. ట్రేడింగ్ సమయంలో 4 శాతానికి పైగా లాభపడి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.10,839.45ను తాకింది. కంపెనీ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో పెరగడం, దేశీయంతో పాటు ఎగుమతుల మార్కెట్లలో బలమైన వృద్ధి నమోదు కావడంతో ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకున్నాయి.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బజాజ్ ఆటో కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 45.9 శాతం పెరిగి రూ.3,225.63 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన కన్సాలిడేటెడ్ ఆదాయం 65 శాతం వృద్ధితో రూ.21,688.83 కోట్లుగా నమోదైంది.
కంపెనీ స్టాండ్అలోన్ ప్రాతిపదికన కూడా ఆల్టైమ్ హై త్రైమాసిక ఆదాయం, లాభాలను సాధించింది. నికర లాభం 42.3 శాతం పెరిగి రూ.2,982.84 కోట్లకు చేరగా (గత ఏడాది ఇదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.