భారతదేశం, ఫిబ్రవరి 26 -- ప్రేమలో విఫలం కావడం లేదా నమ్మిన బంధం తెగిపోవడం అనేది ఎవరికైనా మానసికంగా పెద్ద దెబ్బే. విడిపోవడం అనేది కేవలం ఒక వ్యక్తిని దూరం చేసుకోవడం మాత్రమే కాదు, మనలో ఒక భాగాన్ని కోల్పోయినంత పని అవుతుంది. అయితే, ఈ బాధ నుంచి ఆరోగ్యకరమైన రీతిలో బయటపడి, మళ్లీ ప్రశాంతతను ఎలా పొందాలో ప్రముఖ రిలేషన్‌షిప్ కోచ్, కపుల్స్ కౌన్సెలర్ కంఫర్ట్ ఓమోవ్రే ఇన్‌స్టా వేదికగా కొన్ని కీలక సూచనలు చేశారు.

విడిపోయిన తర్వాత పాత జ్ఞాపకాల సంకెళ్లను తెంచుకుని, మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకోవాలో ఆయన మాటల్లోనే చూద్దాం.

"నేను చేసింది కరెక్టేనా?" అనే సందేహం మిమ్మల్ని లోలోపల తూర్పారబడుతుంది. అందుకే, ఆ బంధంలో మీరు అనుభవించిన బాధను ఒక్కసారి గుర్తుచేసుకోండి. విడిపోవడమే సరైన నిర్ణయమని మీకు మీరు చెప్పుకోండి. దీనివల్ల మీరు దేన్నీ కోల్పోవడం లేదు, పైగా మీకు మీరు స్వ...