భారతదేశం, జూన్ 11 -- ప్రేమ లేదా పెళ్లి బంధాల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది 'రెడ్ ఫ్లాగ్స్' (ప్రమాదకర లక్షణాలు) గురించే ఎక్కువగా చర్చిస్తుంటారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, మానసికంగా అందుబాటులో ఉండకపోవడం లేదా వేధించడం వంటి నెగెటివ్ అంశాలపైనే అందరి దృష్టి ఉంటుంది. కానీ, ఒక ఆరోగ్యకరమైన బంధం నిలబడాలంటే కేవలం సమస్యలు లేకపోతే సరిపోదు; పరస్పర గౌరవం, మానసిక పరిణతి, ఇరువైపులా ప్రయత్నం ఉండాలి. వీటినే మనం 'గ్రీన్ ఫ్లాగ్స్' (సానుకూల లక్షణాలు) అంటాం. మీ పార్ట్‌నర్‌తో మీ బంధం లాంగ్ రన్ లో సక్సెస్ అవుతుందో లేదో తెలిపే ఆ పాజిటివ్ లక్షణాల గురించి కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ దామిని గ్రోవర్ కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.

భావోద్వేగ పరంగా ఒకరినొకరు నమ్మాలంటే భాగస్వామికి తన తప్పులను అంగీకరించే గుణం ఉండాలి. చాలా బంధాలలో గొడవలు రావడానికి కారణం పొరపాట్ల...