భారతదేశం, డిసెంబర్ 25 -- బంగ్లాదేశ్‌లో అశాంతి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా రాజ్‌బరి జిల్లాలో ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి మూకదాడికి బలైపోయారు. వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిని దారుణంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గురువారం వెలుగులోకి వచ్చాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాజ్‌బరి జిల్లా పాంగ్షా పరిధిలోని హోసెన్‌దంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అమృత్ మొండల్‌గా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తిని అమృత్ డబ్బులు డిమాండ్ చేశాడని, ఆ సమయంలో గొడవ జరిగిందని సమాచారం. అమృత్ తన గ్యాంగ్‌తో కలిసి షాహిదుల్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడంతో, కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు.
ఆ కేకలు విన్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.