భారతదేశం, డిసెంబర్ 25 -- బంగ్లాదేశ్‌లో అశాంతి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా రాజ్‌బరి జిల్లాలో ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి మూకదాడికి బలైపోయారు. వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతడిని దారుణంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు గురువారం వెలుగులోకి వచ్చాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రాజ్‌బరి జిల్లా పాంగ్షా పరిధిలోని హోసెన్‌దంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అమృత్ మొండల్‌గా గుర్తించారు. అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తిని అమృత్ డబ్బులు డిమాండ్ చేశాడని, ఆ సమయంలో గొడవ జరిగిందని సమాచారం. అమృత్ తన గ్యాంగ్‌తో కలిసి షాహిదుల్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడంతో, కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారు.

ఆ కేకలు విన్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేర...