బంగాళాఖాతంలో వాయుగుండం... విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం, భారీ వర్ష సూచన
భారతదేశం, సెప్టెంబర్ 22 -- పశ్చిమమధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారుతోంది. గడిచిన 6 గంటల కాలంలో ఈ వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా పయనించిందని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్, పూరీలకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే ఏపీలోని కళింగపట్నానికి 230 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో తీరానికి దగ్గరగా కదులుతోంది. రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి 'తీవ్ర వాయుగుండం' (Deep Depression)గా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఇది మరింత ముందుకు కదిలి, రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో విశాఖపట్నం నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.